మీ డైట్‎లో ముల్లంగి ఉంటే.. ఆ సమస్యలన్నీ ఇక ఖతం.. 

07 September 2025

Prudvi Battula 

ముల్లంగిలో ఫోలేట్, విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి.

దీన్ని సలాడ్‌గా లేదా కూరగాయలతో ఉడికించి తినవచ్చు. ముల్లంగి తినడం వల్ల శరీరంలో పోషకాహార లోపం ఏర్పడదు.

కడుపులో గ్యాస్ వస్తుందనే భయంతో చాలా మంది ముల్లంగి తినడానికి ఇష్టపడరు. నిజానికి ఇది మిమ్మల్ని జీర్ణ సంబంధ వ్యాధుల నుంచి కాపాడుతుంది.

ముల్లంగిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్ధకం సమస్య దూరం చేస్తుంది.

ముల్లంగిలో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అలాగే ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.

కాలేయ వ్యాధికి దూరంగా ఉండాలంటే ముల్లంగి తినవచ్చు. ఎలాంటి కాలేయ వ్యాధికైనా ముల్లంగి ఔషధంలా పనిచేస్తుంది.

బరువు తగ్గాలనుకుంటే, పచ్చి ముల్లంగిని సలాడ్‌లో కలిపి తినవచ్చు. శరీరంలో పేరుకుపోయిన అన్ని కాలుష్యాలను కూడా బయటకు పంపుతుంది.

ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.