హోలీకి ముందు మీ కలలో ఇవి కనిపిస్తే.. జీవితంలో ఊహించని అదృష్టం మీదే!
samatha
10 march 2025
Credit: Instagram
కలలు కలనడం అనేది సహజం. ప్రతి ఒక్కరికీ రాత్రి నిద్రపోయిన తర్వాత కలలు వస్తుంటాయి. అయితే స్వప్నశాస్త్రం ప్రకారం కలల కూడా జీవితంలో శుభ, అశుభ పలితాలను ఇస్తాయంటున్నారు పండితులు.
కలలు అనేవి మనం మన మనసులో అనునేవి కలల రూపంలో వస్తుంటాయి. అయితే కొన్ని సార్లు మనకు వచ్చే కలలు భవిష్యత్తులో మంచిని చూపిస్తే మరికొన్ని చెడును పరిచయం చేస్తాయి.
అయితే కొన్ని రకాల కలలు మాత్రం తప్పకుండా జీవితం పై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు.
హోలీ పండుగ వచ్చేస్తుంది. అయితే ఈ హోలీ సమయంలో ఎవరికైనా ఇలాంటి కలలు గనుక వచ్చినట్లు అయితే వారు రాబోయే రోజులలో రాజభోగం అనుభవిస్తారంట.
కాగా, అసలు ఎలాంటి కలలు హోలీ రోజు వస్తే మంచిది. శుభ సంకేతాలు, సంపదను రెట్టింపు చేసే కలలు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
స్వప్నశాస్త్రం ప్రకారం ఎవరికైతే హోలీ ముందు రంగులతో ఆటలు ఆడుకున్నట్లు కల వస్తుందో, వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని, జీవితంలో ఆనందం ఉంటుందని అర్థం అంట.
అదే విధంగా, హోలీ రోజు డబ్బులు కనిపిస్తాయో, వారు నిజజీవితంలో కూడా చాలా డబ్బను సంపాదిస్తారంట. మీకు ధనలాభం కలుగుతుందని అర్థం.
హోలీ రోజున మీ కలలో చేప ఈతకొడుతున్నట్లు గనుక కనిపించినట్లు అయితే, మీరు త్వరలో విజయం సాధించబోతున్నారని, మీ ఇంట్లో ఆనందకర వాతావరణం నెలకొంటుందని అర్థం అంట.
స్వప్న శాస్త్రం ప్రకారం, మీ కలలో బంగారం లేదా వెండి ఆభరణాలు గనుక చూసినట్లు అయితే అవి చాలా శుభసూచకం అంట. దీని వలన మీరు అధికంగా డబ్బు సంపాదిస్తారంట.