బెడ్ ఎక్కే ముందు ఈ ఫుడ్స్ తింటే.. నిద్ర మిమ్మల్ని హత్తుకుంటుంది.. 

Prudvi Battula 

Images: Pinterest

30 October 2025

ప్రస్తుతకాలంలో చాలామంది రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారు.అయితే నిద్రపోయేముందు కొన్ని ఫుడ్స్ తింటే హాయిగా నిద్రపడుతుంది.

నిద్రపట్టక ఇబ్బంది

కివీలో సెరోటోనిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది నిద్రకు ఉపయోగపడే రసాయనం. పడుకునే గంట ముందు ఒకటి లేదా రెండు తిండి ప్రశాంతంగా నిద్రపోతారు.

కివి

టార్ట్ చెర్రీస్‎లో మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఉంటుంది.పడుకునే ముందు దీని జ్యూస్ ఒక చిన్న గ్లాసు తాగితే త్వరగా నిద్రలోకి జారుకుంటారు.

టార్ట్ చెర్రీస్

రాత్రి భోజనం తర్వాత కొద్దిసేపటికి బాదం తీసుకుంటే రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంటుంది. అలాగే రాత్రి సమయంలో మంచి నిద్రకు సహాయపడుతుంది.

బాదం

అరటిపండ్లు ట్రిప్టోఫాన్‌తో నిండి ఉంటాయి. అలాగే సెరోటోనిన్, మెలటోనిన్‌ కూడా లభిస్తాయి. అవి సరళమైన నిద్రను ప్రోత్సహిస్తాయి.

అరటిపండు

గోరువెచ్చని పాలలో ట్రిప్టోఫాన్, కాల్షియం ఉంటాయి. ఇవి రెండూ మెలటోనిన్ ఉత్పత్తికి పించి మంచి నిద్రకు సహాయపడతాయి. అందుకే నిద్రకు ముందు పాలు తాగాలి.

వెచ్చని పాలు

రాత్రిపూట ఒక గిన్నె ఓట్స్ తింటే ఉత్తేజంగా అనిపిస్తుంది. వీటిలో సహజంగానే ఉన్న మెలటోనిన్, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి.

ఓట్స్

మీరు రాత్రి మంచం ఎక్కే ముందు ఒక కప్పు చామంతి టీ తాగారంటే మనస్సు ప్రశాంతపరిచి మంచి నిద్రకు సహాయపడుతుంది.

చామంతి టీ