రోజుకో స్ట్రాబెర్రీ తింటే.. ఆ సమస్యలకు బెర్త్ కన్ఫర్మ్ అయినట్టే..

20 September 2025

Prudvi Battula 

స్ట్రాబెర్రీల్లో విటమిన్ సి, ఎలాజిక్ ఆమ్లం, ఆంథోసైనిన్లు వంటి యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా లభిస్తాయి. ఇవి కణాలు దెబ్బతినడాన్ని వాపును నివారించడంలో సహాయపడతాయి.

ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు స్ట్రాబెర్రీలలో ఎక్కువగా ఉన్నందున రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చెయ్యడం మాత్రమే కాదు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

ఇందులో లభించే యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అలాగే మానసిక స్థితిని మెరుగుపడుతూంది.

దీంతో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. చర్మంపై ముడతలను తగ్గించి వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుంది.

స్ట్రాబెర్రీలు విటమిన్ సి, ఆంథోసైనిన్లకి మంచి మూలం, ఇది మీ కళ్ళు దెబ్బతినకుండా రక్షించడం మాత్రమే కాదు వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణతను తగ్గిస్తుంది.

వీటిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపును తగ్గించి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇందులో లభించే విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి వ్యాధులతో పోరాడటంలో ఉపయోగపడుతుందని అంటున్నారు నిపుణులు.