రొయ్యలతో వీటిని తిన్నారంటే ఇక అంతే.! బాడీ షెడ్డుకే..
02 September 2025
Prudvi Battula
రొయ్యలు చాలా రుచికరంగా ఉంటాయి. వీటితో రొయ్యల ఇగురు, గోంగూర రొయ్యల కూర, రొయ్యల ఫ్రై అంటూ అనేక రకాలుగా వండుకొని ఇష్టంగా తింటారు.
రొయ్యల్లో ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. అయినప్పట్టికీ కొన్ని ఆహారాలతో కలిపి తీసుకొంటే అనారోగ్యం అంటున్నారు నిపుణులు.
పాల ఉత్పత్తులలోని కాల్షియం రొయ్యలలోని ప్రోటీన్లతో చర్య జరిపి కడుపులో జీర్ణక్రియకు అడ్డుపడుతుంది. ఈ కాంబినేషన్ అంత మంచిది కాదు.
పెరుగు కూడా రొయ్యలు తిన్న వెంటనే తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.
రొయ్యలతో పాటు వేయించిన ఆహారాలు, మసాలా ఫుడ్స్ తింటే జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, అసౌకర్యం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
పాలకూర వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలతో వీటిని తీసుకోవడం వల్ల ఐరన్ శోషణ మురుపడినప్పటికీ ఇది ఐరన్ ఎక్కువగా అవసరం లేనివారికి హాని కలిగించే అవకాశం ఉంది.
బ్రెడ్, పాస్తా లేదా వైట్ రైస్ వంటి స్టార్చ్ అధికంగా ఉండే ఆహారాలతో రొయ్యలు తినడం వల్ల కడుపులో అసౌకర్యం కలిగి జీర్ణ సమస్యలు, ఉబ్బరం, కడుపులో చికాకు వంటి సమస్యలు వస్తాయి.
సిట్రస్ ఫ్రూట్స్‌లో సిట్రిక్ యాసిడ్, రొయ్యల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండూ కలిపి చర్య జరిపే అవకాశం ఉంది. దీంతో కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదముంది.