వరుసగా వారం పాటు పనీర్ తింటే.. ఆ సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టినట్టే..

Prudvi Battula 

Images: Pinterest

24 October 2025

పనీర్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది బలమైన కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. జిమ్‌కు వెళ్లేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కండరాలు బలపడతాయి

పనీర్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.  ఇదిఎముకలు, దంతాలను బలంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.

ఎముకలు దృఢంగా మారుతాయి

పనీర్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

శరీరానికి శక్తి

కేలరీలు, కొవ్వు కారణంగా మీరు ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని మితంగా తీసుకోవాలి.

బరువు పెరుగుట

పనీర్‌లో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది ఎక్కవగా తీసుకోవద్దు.

కొలెస్ట్రాల్ పెరగవచ్చు

పనీర్ ఒక పాల ఉత్పత్తి. దీన్ని ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, అజీర్ణం వస్తుంది. మీరు లాక్టోస్ అసహనం కలిగి ఉంటే దీన్ని నివారించడం మంచిది.

జీర్ణ రుగ్మతలు

మీరు పనీర్ మాత్రమే తింటే, మీ శరీరంలో పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది. మీరు ఫైబర్, విటమిన్ లోపాలతో బాధపడవచ్చు.

పోషక అసమతుల్యత

పనీర్ ని మితంగా తినండి. కూరగాయలతో కలిపి వండుకుంటే శరీరానికి పూర్తి పోషణ లభిస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.

తినడానికి ఉత్తమ మార్గం