పరగడుపున తులసి ఆకులు తీసుకుంటే.. ఆరోగ్య సమస్యలు తుస్..!

02 September 2025

Prudvi Battula 

ఉదయం తాజా తులసి ఆకులు నమిలితే రోగనిరోధక శక్తి  పెరుగుతుంది. అలాగే రాత్రిపూట పేరుకుపోయే విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది.

రోజూ పరగడుపున తులసి ఆకులు తింటే జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడిని దూరం చేయడంలో సహాయపడుతుంది.

తులసిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు శ్వాసకోశ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఈ ఆకులను నమలడం వల్ల శ్లేష్మం, కఫం దూరం అవుతాయి.

పరగడుపున తులసి ఆకులు వల్ల ఆస్తమా, బ్రోన్కైటిస్, అలెర్జీలు వంటివి తగ్గుతాయి. అలాగే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఉదయం తులసి ఆకులను నమలడం వల్ల దృష్టి, ఏకాగ్రత, మానసిక స్పష్టత మెరుగుపడతాయి. అలాగే నిద్ర నాణ్యతను కూడా పెంచుతుంది.

తులసి ఆకులను నమలడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు ఉత్తేజితమవుతాయి. కడుపులోని ఆమ్లాన్ని సమతుల్యం చేస్తాయి. ఉబ్బరన్ని నివారిస్తాయి.

తులసి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. దీంతో షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. బరువు కూడా తగ్గుతుంది.

తులసి చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (HDL)కు మెరుగుపరుస్తుంది. ఇది గుండె సమస్యలు రాకుండా రక్షిస్తుంది.