జీడిపప్పుతో చేసిన పాలు తాగారంటే.. అనారోగ్యం కథ కంచికే..
Prudvi Battula
Images: Pinterest
27 November 2025
జీడిపప్పు పాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, మోనోశాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని దూరం చేస్తాయి.
గుండెకు మేలు
జీడిపప్పులో లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కళ్ళను హానికరమైన కాంతి నుండి రక్షించి కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి దృష్టిని ప్రోత్సహిస్తాయి.
కంటికి మంచిది
ఇందులో తక్కువ కేలరీలు, అనాకార్డిక్ ఆమ్లం కొవ్వు పేరుకుపోవడాన్ని పరిమితం చేసి అధిక బరువు సమస్యను తగ్గిస్తాయి.
అధిక బరువు దూరం
జీడిపప్పు పాలలో కాల్షియం, విటమిన్ డి ఎముకలను బలంగా మారుస్తాయి. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారిస్తాయి.
ఆస్టియోపోరోసిస్ నివారిణి
దీనిలో విటమిన్ E ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ
ఇందులో మెగ్నీషియం, విటమిన్ E ఇవి రోగనిరోధక పనితీరు మెరుగుపరిచి మొత్తం ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ఈ పాలలో పిత్తాశయ రాళ్ళు ఏర్పడకుండా నిరోధించడానికి, పిత్తాశయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడే బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి.
కిడ్నీలో రాళ్ళు ఏర్పడవు
జీడిపప్పులోని విటమిన్ E చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది UV రేడియేషన్, కాలుష్యం వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది. చర్మ కాంతివంతంగా మారుతుంది.