ప్రస్తుతకాలంలో దాదాపుగా అందరు Gmail ఉపయోగిస్తున్నారు. దీన్ని మెయిల్స్ కోసం మాత్రమే కాదు. కాంటాక్ట్స్, ఫొటోస్ స్టోర్ చేయడం కోసం కూడా వాడుతున్నారు.
Gmail
విద్య నుంచి ఉద్యోగం వరకు Gmail వాడుతున్నారు. దీని స్టోరేజీ నిండిపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది.
స్టోరేజీ నిండిపోవడం
మీరు Gmail ఖాతాను క్రియేట్ చేసుకోవడం ద్వారా 15GB నిల్వ ప్రయోజనాన్ని పొందుతారు. అయితే ఇది కొన్నిసార్లు ఫుల్ అయిపోతుంది.
15GB స్టోరేజీ
మీ Gmail అకౌంట్లోని పెద్ద అటాచ్‌మెంట్‌లు ఉన్న ఇమెయిల్‌లను తీసివేయడం ద్వారా మీరు నిల్వను ఖాళీ చేయవచ్చు.
స్టోరేజీ క్లీనింగ్
సెర్చ్ బాక్స్‌లో "larger:20M" కోసం శోధించండి. ఏ ఇమెయిల్ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుందో మీకు కనిపిస్తుంది. మీ ఇన్‌బాక్స్‌ను మాత్రమే కాకుండా, మీ స్పామ్ ఫోల్డర్‌ను ఖాళీ చేయండి.
larger:20M
Gmail సెర్చ్‌లో "older_than:2y" అని టైప్ చేయడం ద్వారా శోధించండి. ఏ ఇమెయిల్‌లు 2 సంవత్సరాల కంటే పాతవో మీకు తెలుస్తుంది. పనికిరాని ఇమెయిల్‌లను తొలగించండి.
older_than:2y
Gmail మాత్రమే కాదు, 15GB నిల్వలో డ్రైవ్, Google ఫోటోలు కూడా ఉంటాయి. వీటి నుండి అనవసరమైన వాటిని కూడా తొలగించండి.
అనవసరమైన ఫోటోలు తొలగించండి
అనవసరమైన ఈమెయిల్స్ వచ్చే ఈమెయిల్ చిరునామాలను బ్లాక్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ Gmail పనికిరాని ఈమెయిల్స్ తో నిండిపోదు.