ఈ సూపర్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. మీ ముఖం చంద్రునిలా మెరుస్తుంది..
Prudvi Battula
Images: Pinterest
26 October 2025
మీ ముఖాన్ని అందంగా, ఆరోగ్యంగా మార్చడానికి కలబంద జెల్, తేనె, పెరుగు కలిపి చేసుకోనున్న ఫేస్ ప్యాక్ సరిపోతుంది.
ఫేస్ ప్యాక్
ఒక గిన్నెలో కలబంద జెల్, తేనె, పెరుగు సమాన పరిమాణంలో తీసుకొని పేస్ట్‌లా మారేంత వరకు బాగా కలుపుతూ ఉండండి.
తయారీ విధానం
ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై సమానంగా ప్యాక్‌లా అప్లై చెయ్యండి. తర్వాత కనీసం 20 నిమిషాలు పట్టు అలాగే ఉంచుకోవాలి.
ఎలా అప్లై చెయ్యాలి?
ఇది చర్మంలో హైడ్రేషన్‌ను నిర్వహిస్తుంది. అవసరమైన పోషణను అందిస్తుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను కూడా తొలగిస్తుంది. సహజమైన మెరుపును ఇస్తుంది.
ప్రయోజనాలు
కలబంద జెల్, తేనె, పెరుగు ఫేస్ ప్యాక్ చర్మంపై ఎరుపు, మంటను నయం చేస్తుంది. అలాగే, ఇది సన్ టానింగ్‌ను సరిచేయడంలో సహాయపడుతుంది.
అదనపు ప్రయోజనాలు
ఈ 3 పదార్థాల ఫేస్ ప్యాక్‌ను వారానికి 2 లేదా 3 సార్లు ఉపయోగించవచ్చు. ఇది సహజ పదార్ధాలతో తయారు చేయబడినందున, ఇది ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించదు.
వారానికి 2 లేదా 3 సార్లు
చర్మ సంరక్షణలో ఓపిక చాలా అవసరం. సహజ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల ఆశించిన ఫలితాలు కనిపించడానికి కొన్ని వారాలు పట్టవచ్చు.
ఓర్పు అవసరం
నల్లటి వలయాలను వదిలించుకోవడానికి, కలబంద జెల్‌ను రోజ్ వాటర్, తేనెతో కలిపి కళ్ళ కింద పూయండి. ఇది వాపును తగ్గిస్తుంది. నల్లటి వలయాలను పోగొట్టడానికి కూడా సహాయపడుతుంది.