పనస పిక్కలు మీ డైట్లో ఉంటే.. అనారోగ్యాన్ని సమాధి చేసినట్టే..
Prudvi Battula
Images: Pinterest
28 November 2025
పనస గింజలు ప్రోటీన్, ఫైబర్, అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. అవి మొత్తం ఆరోగ్యానికి తోడ్పడే పోషకాల అందిస్తాయి.
పనస గింజలు
జాక్‌ఫ్రూట్ గింజలు ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కండరాలను బలంగా మారుస్తాయి.
కండరాలకు బలం
ఈ గింజలలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను ప్రోత్సహించి మలబద్ధకాన్ని నివారిస్తుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
జీర్ణక్రియ సజావుగా
వీటిలోని ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్‌లు ఆక్సీకరణ ఒత్తిడిని, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మీ ఆహారంలో చేర్చుకుంటే సహజ రక్షణ వ్యవస్థకు మెరుగుపడుతుంది.
దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి
దీనిలో పొటాషియం, ఫైబర్ రక్తపోటును, ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేసి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
గుండెకు మంచిది
వీటిలో అధిక ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ కలయిక ఆకలిని నియంత్రించి శరీర బరువును తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
బరువు తగ్గుతుంది
జాక్‌ఫ్రూట్ విత్తనాలలోని బయోయాక్టివ్ సమ్మేళనాలు అసాధారణ కణాల పెరుగుదలను నిరోధించి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
క్యాన్సర్ నివారిణి
పనస పిక్కల్లో విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. దీంతో అనారోగ్య సమస్యలు దరిచేరవు.