సీతాఫలం తీసుకుంటే.. ఆ సమస్యలపై వార్ డిక్లేర్ చేసినట్టే..

22 September 2025

Balaraju Goud 

ఉమాంగ్ యాప్‌ ద్వారా మీ పిఎఫ్ ఖాతా నుండి పూర్తిగా ఆన్‌లైన్‌లో, ఎటువంటి పత్రాలు లేకుండా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఉమాంగ్ యాప్‌ని ఉపయోగించి పిఎఫ్ క్లెయిమ్ ఫైల్ చేయడానికి, మీ ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్‌కి వెళ్లి, ఉమాంగ్ యాప్ కోసం సెర్చ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.

యాప్ తెరిచి మీ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోండి. మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని నమోదు చేసి ధృవీకరించండి.

ఇప్పుడు ఉమాంగ్ యాప్ హోమ్‌పేజీకి వెళ్లి ఇక్కడ EPFO ​పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అనేక ఎంపికలు కనిపిస్తాయి.

వాటిలో నుంచి ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్ అనే ఆప్షన్‎‎పై క్లిక్ చేసి రైజ్ క్లెయిమ్ ఎంపికను ఎంచుకోండి.

ఇప్పుడు మీరు మీ UAN నంబర్‌ను నమోదు చేయాలి. మళ్ళీ మీ మొబైల్‌కు OTP వస్తుంది. దానిని నమోదు చేసి ధృవీకరించండి.

ఒక ఫారమ్ తెరుచుకుంటుంది. మీరు ఎంత డబ్బును ఉపసంహరించుకోవాలనుకుంటున్నారో.. ఉపసంహరణకు కారణాన్ని సూచించమని అడుగుతుంది. కారణాన్ని ఎంచుకోండి.

కొన్ని సందర్భాల్లో, మీరు వైద్య ధృవీకరణ పత్రం, విద్యా రుజువు, ఇంటి కొనుగోలు ఒప్పందం మొదలైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి రావచ్చు.

అన్ని వివరాలను పూరించి 'సమర్పించు' బటన్‌పై క్లిక్  చేసిన తర్వాత ట్రాక్ క్లెయిమ్ విభాగానికి వెళ్లి మీ దరఖాస్తు స్టేటస్ చెక్ చేయవచ్చు. SMS ద్వారా లేదా UMANG యాప్‌లో నోటిఫికేషన్ అందుకుంటారు.