అరటిపండు తినడం వల్ల చాలా ప్రమోజనాలు ఉంటాయి. ఫైబర్, ప్రొటీన్, విటమిన్లు, పొటాషియం, రాగి వంటి అనేక పోషకాల నిధి. ఉదయాన్నే తింటే శరీరానికి లెక్కలేనని ప్రయోజనాలు
అరటి పండ్లలో శరీరానికి కావలసిన వివిధ రకాల పోషకాలతో పాటు ఖనిజాలు కూడా ఎక్కువగా లభిస్తాయి. ఇవి పిల్లల నుంచి పెద్దల వరకు ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి.
ముఖ్యంగా అరటిపండ్లలో విటమిన్ b6తో పాటు విటమిన్ సి, ఐరన్ మాంగనీస్ క్యాల్షియం ఎక్కువ మోతాదులో లభిస్తాయి.
ప్రతిరోజు ఉదయం అరటిపండు తినడం వల్ల శరీరంలో ఎముకల సమస్యల నుంచి కండరాల సమస్యల వరకు ఎన్నో వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది.
నిజానికి అరటి పండ్లలో ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి.. అంతేకాకుండా కొన్ని అరటిపండు తీపి కూడా ఎక్కువ కలిగి ఉంటాయి.
అరటి పండ్లు అధిక తీపిని కలిగి ఉంటాయని మధుమేహం ఉన్నవారు వీటికి దూరంగా ఉంటారు. తియ్యగా ఉండే అరపటి పండు వల్ల షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయని భావిస్తుంటారు.
వాస్తవానికి డయాబెటిస్ పేషెంట్లకు అరటిపండు చాలా హెల్ప్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అది కూడా అధికంగా కాకుండా కొద్దిగా తీసుకోవటం మంచిది అని సూచిస్తున్నారు.
మధుమేహం ఉన్నవారు కూడా అరటి పండ్లను రోజు ఉదయం పూట తినొచ్చని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే సహజ చక్కెర శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారు పరిమితంగా మాత్రమే అరటి పనులను తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.