ఈ చిన్న చిట్కాలతో మీ భుజం నొప్పి మటుమాయం

Phani CH

06 December 2024

రోజు మొత్తం అనేక రకాల  పనులు చేస్తూ  మనుషులు అలిసిపోతుంటారు.. మరికొంతమంది ఒంటినొప్పులతో బాధపతుంటారు..

మరోవైపు కరోనా తెచ్చిన సమస్యలు మనిషిని అతలాకుతలం చేసింది దీనికి తోడు శారీరక శ్రమ పెరిగి నొప్పులు తెచ్చిపెడుతోంది.

కొంతమందికి ఒంటినొప్పులతో పాటు ఎక్కువగా భుజం నొప్పి చాలా వేధిస్తూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాని అసలు భుజం నొప్పి తగ్గదు.

అయితే ఈ నొప్పులు తగ్గడానికి పదేపదే నొప్పి నివారణ మందులు  తీసుకుంటారు.. ఈ టాబ్లెట్స్ కు బదులు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఫలితం ఉంటుంది.

బ‌కెట్ వేడి నీటిలో ఒక అర క‌ప్పు వ‌ర‌కు ఎప్సోమ్ ఉప్పు వేసి  క‌రిగించండి.. ఆ నీటితో ప్ర‌తి రోజు ఉద‌యం సాయంత్రం స్నానం చేస్తే కండరాల నొప్పులు తగ్గుతాయి.

ఒక కాటన్ క్లాత్ లో ఐస్ ముక్క‌ల‌ను చుట్టు దీనిని మీ భుజాల‌పై  ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉంచుకుంటే భుజం నొప్పి అనేది తగ్గుతుంది

ఒక గిన్నెలో మూడు స్పూన్ల ప‌సుపు  నాలుగు స్పూన్ల కొబ్బ‌రి నూనె కలిపి ఆ మిశ్ర‌మాన్ని భుజాల‌కు అప్లై  చేసి ఆ మిశ్రమం ఎండిన తరువాత వేడి నీటితో స్నానం చేస్తే ఉపశమనం ఉంటుంది.