కిసుక్కు పాప కిల్లింగ్ లుక్స్..  శ్రీలీల పిక్స్ వైరల్

Phani CH

05 December 2024

శ్రీలీల గురించి తెలుగు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.. మొన్నటి వరకు చేతినిండా సినిమాలతో కెరీర్‌ పరంగా దూసుకెళ్లింది ముద్దుగుమ్మ.

ఓవైపు ఎంబీబీఎస్‌ చదువుతూనే మరోవైపు టాప్‌ హీరోల సరసన ఆఫర్స్‌ సొంతం చేసుకుంటూ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.

అక్కడ నుంచి ఒక టైం లో అయితే టాలీవుడ్ లోనే మోస్ట్ యంగ్ హీరోయిన్ కం అత్యధిక సినిమాలు కూడా చేతిలో ఉన్న ఇండియన్ హీరోయిన్ గా కూడా రికార్డు సెట్ చేసింది.

కానీ అదృష్టం కలిసి రాక చేసిన ప్రతీ సినిమా వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో కాస్త జోరు తగ్గించిన ఈ ముద్దుగుమ్మ సరైన కథ కోసం వేచి చూస్తోంది.

ప్రస్తుతం ఆమె చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ 75వ సినిమాలు మాత్రమే ఉన్నాయి. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో సినిమాకు గ్రీన్ ఇచ్చినట్లు తెలిసింది.

దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అదే నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్హుడ్. ఇందులో శ్రీలీల అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఫుల్ రిచ్ అండ్ గ్లామర్ గా కనిపించింది.