బ్లాక్ కాఫీ తాగడం ఇష్టమా.. అయితే తప్పక ఇవి తెలుసుకోండి!
10 october 2025
Samatha
బ్లాక్ కాఫీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. దీనిని ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. అయితే బ్లాక్ కాఫీ తాగే వారు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలంట.
బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీనిని అతిగా కాకుండా మితంగా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అయితే బ్లాక్ కాఫీ తాగే వారు కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏవంటే?
బ్లాక్ కాఫీని రోజుకు ఒక కప్పు తాగండి. తాగిన తర్వాత నిద్రలేమి, వణుకు, దడ వంటి సమస్యలు తలెత్తుతే, దానిని అతిగా తీసుకోకూడదంట.
చాలా మంది బ్లాక్ కాఫీలో మంచి ఫ్లేవర్ కోసం చక్కెర, క్రీమ్, ఫ్లేవర్డ్ సిరప్‌లను వేస్తుంటారు. కానీ ప్లేయిన్ బ్లాక్ కాఫీనే తాగలంట. ఎందుకంటే, ఇందులో కేలరీలు ఉండవు, బరువు తగ్గేలా చేస్తుంది.
బ్లాక్ కాఫీ ఎప్పుడూ కూడా రాత్రి సమయంలో, సాయంత్రం సమయంలో తాగకూడదంట. ఉదయం లేదా మధ్యాహ్నం బ్లాక్ కాఫీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదంట
బ్లాక్ కాఫీని అతిగా కాకుండా మితంగా తీసుకోవడం వలన ఇది చురుకుదనాన్ని పెంచడమే కాకుండా, ఏకాగ్రతను మెరుగు పరుస్తుంది. జీవక్రియ సక్రమంగా సాగేలా చేస్తుంది.
బ్లాక్ కాఫీ మితంగా తీసుకోవడం వలన ఇది గుండె జబ్బులు, కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే దీనిని ఎప్పుడూ మితంగానే తీసుకోవాలంట.
కొంత మందిలో కాపీ కడుపులో చికాకును కలిగిస్తుంది. అయితే మీకు ఆమ్లత్వం అనిపిస్తే దీనిని నీరు తాగి తర్వాత లేదా భోజనం చేసిన తర్వాత తాగడం మంచిదంట.