సమ్మర్ వచ్చిందంటే చాలు భానుడి భగ భగలు , చుక్కలు చూపిస్తాయి. క్షణం బయటకి వెళ్లాలి అంటే వణికిపోవాల్సిన పరిస్థితుల ఎదురు అవుతాయి.
సమ్మర్
ఇక కొంత మంది తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఈ సమయంలో వడదెబ్బ తగిలి చాలా మంది ఇబ్బందులు ఎదుర్కుంటారు.
బయటకు వెళ్లడం
అయితే ఇప్పుడు మనం వడదెబ్బ తగలడం వలన ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
వడదెబ్బ
వడ దెబ్బ తగిలినప్పుడు తీవ్రమైన జ్వరం, తల నొప్పి, చర్మం పొడిగా మారడం వంటి సమస్యలు ఎదురు అవుతాయి.
జ్వరం
ముఖ్యంగా శ్వాస సరిగ్గా రాకపోవడం, మైకం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
మాట తడబడటం, కడుపులో అసౌకర్యం, వాంతులు, విరేచనాలు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి ఇబ్బందులు ఎదురు అవుతాయి.
మాట తడబడటం
అంతే కాకుండా నోటి నుంచి మాట రాకపోవడం, కళ్లు బైర్లు కమ్మడం, చర్మం వేడిగా ఎర్రగా మారడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
స్పృహ కోల్పోవడం
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వడ దెబ్బ తగిలిందని భావించి, సత్వరమే ప్రాథమిక చికిత్స అందించాలి. లేకపోతే కొన్ని సార్లు ఇది ప్రాణానికే ముప్పు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.