తొక్కే కదాని తీసి పడేయకండి.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు
Anand T
01 May 2026
అరటిపండు అంటే చిన్నల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. అయితే చాలా మందిఈ పండు తిని తొక్కను పడేస్తారు. కానీ అరటిపండు తొక్కను ముఖానికి రుద్దడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
చర్మ సౌందర్యం
ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది, కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది.
మధుమేహ నియంత్రణ
తొక్కతో చేసిన పేస్ట్‌ను తలకు రాసుకోవడం వల్ల చుండ్రు తగ్గుతుంది. అలాగే జుట్టు రాలడం నివారించబడుతుంది.
జుట్టు ఆరోగ్యం
దీనిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.
జీర్ణక్రియ మెరుగుదల
ఇందులో ఉండే ట్రిప్టోఫాన్, విటమిన్ B6 డిప్రెషన్ లక్షణాలను తగ్గించి, మూడ్‌ను ఉల్లాసంగా ఉంచుతాయి.
మానసిక ఆరోగ్యం
ఇది రక్తనాళాల పనితీరును మెరుగుపరిచి, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యం
అరటిపండు తొక్కను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది, ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఉపయోగకరం.
బరువు తగ్గడం
ఖరీదైన ఉత్పత్తులు వాడకుండా సహజ సిద్ధంగా చర్మం, జుట్టు సమస్యలను తగ్గించుకునేందుకు అరటిపండు తొక్క బెస్ట్ ఆప్షన్ అవుతుంది.