బంతి పూలు చెట్టు నిండా విరగబూయాలా? ఈ ఒక్క పొడి చల్లితే చాలు!
samatha
02 september 2026
Pic credit - Pinterest
బంతి పూలకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ప్రతి ఒక్కరూ ఈ మొక్కలను పెంచుకుంటారు.
ముఖ్యంగా ఇంటిలో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే ఇంటిని అలంకరించడానికి, పూజకు బంతి పూలు ఉపయోగిస్తారు.
ఇక బతుకమ్మ, దీపావళి పండుగల సమయంలో ఈ పూలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఆ సమయంలో ధరలు మండిపోతాయి.
అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా పెంచుకుంటారు. అయితే మీ ఇంటి బంతి మొక్కలు ఎక్కువగా పూయడం లేదా
అయితే మీ కోసమే ఈ చిట్కాలు.
బంతి పూలు చెట్టు నిండుగా విరగబూయాలి అంటే అంటే తప్పకుండా చెట్టు మొదలు వద్ద గుడ్డు పెంకుల పొడి పోయడం చాలా మంచిదంట. దీని వలన మొక్క విరగబూస్తుంది.
గుడ్డు పెంకులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని ఒక్క స్పూన్ వేయడం వలన మొగ్గలు రాలిపోకుండా, చెట్టు నిండుగా పూలు పూస్తుంటాయి.
అంతే కాకుండా వర్మీకంపోస్ట్ వేసినా కూడా మొక్క వేపుగా పెరిగి, పెద్ద సైజులో పూలను ఇస్తుందంట. అంతే కాకుండా మొక్క కూడా చాలా ఆరోగ్యంగా ఉంటు
ంది.
అదే విధంగా మొక్కకు ప్రతి రోజూ సాయంత్రం సమయంలో నీరు పోయడం, సూర్యరశ్మి తాకేలా చూసుకోవడం వంటివి జాగ్రత్తలు తీసుకోవాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
అతిగా అన్నం తినడం ఎంత ప్రమాదకరమో తెలుసా?
నవ్వండయ్యా బాబు.. నవ్వుతే ఎన్ని లాభాలో తెలుసా?
ఏషనాగుల కట్ట మీద సాంగ్ ట్రెండ్.. ఆ ఫొటోలు షేర్ చేసిన కీర్తి