ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి గుడ్‌న్యూస్..!

22 September 2025

Balaraju Goud 

ఇల్లు కట్టడంలో అతిపెద్ద ఖర్చు సిమెంట్, పెయింట్, వాల్‌పేపర్‌లపైనే. కానీ ఇప్పుడు GST నుండి ఉపశమనం లభించింది.

ఈ నెల ప్రారంభంలో GST కౌన్సిల్ దేశ ప్రజలకు శుభవార్త అందించింది. అనేక విషయాలపై ప్రభుత్వం పన్నులను తగ్గించింది.

ఇల్లు కట్టడానికి కీలకమైన సిమెంట్‎పై GST 28% నుండి 18%కి తగ్గించడం జరిగింది. అంటే ఇప్పుడు అది 10% చౌకగా మారింది.

దీని ద్వారా 50 కిలోల సిమెంట్ బస్తాపై రూ. 30–35 వరకు ఆదా అవుతుంది. ఇది నిర్మాణ వ్యయాన్ని తగ్గిస్తుంది.

ఇప్పుడు పెయింట్‎పై GST కూడా 28% నుంచి 18%కి తగ్గించింది ఫైనాన్స్ మినిస్ట్రీ. పండుగల సమయంలో దాని డిమాండ్ పెరుగుతుంది.

దీపావళి, దుర్గా పూజల సమయంలో పెయింటింగ్ పనులు చేసేవారు ఇప్పుడు పెయింట్‌పై ప్రత్యక్ష పొదుపు ప్రయోజనాన్ని పొందుతారు.

వాల్‌పేపర్‌పై GST 28% నుండి 18%కి తగ్గించడం జరిగింది. దీని వలన డెకర్ ఎంపికలు మరింత సరసమైనవిగా మారాయి.

GSTలో ఈ మార్పులు గృహనిర్మాణ రంగానికి ఊతం ఇస్తాయి. 'ప్రజలు అందరికీ గృహనిర్మాణం' మిషన్‌ను వేగవంతం చేస్తాయి.