పరగడుపున ఈ ఫుడ్స్ తింటే.. మీ ఆరోగ్యం రిస్క్‎లో పడినట్టే.. 

20 September 2025

Prudvi Battula 

కొన్ని ఫుడ్స్ ఏమి తినకుండా ఖాళీ కడుపుతో తీసుకుంటే గ్యాస్, గుండెల్లో మంట, వాంతులు వంటి సమస్యలకు కారణం అవుతాయి.

సిట్రస్ పండ్లలో  సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. నిమ్మ, బత్తాయి, నారింజ వంటి పండ్లు  ఖాళీ కడుపుతో తింటే ఆమ్లత్వాన్ని పెంచుతాయి.

దీని కారణంగా గుండెల్లో మంట, కడుపు నొప్పి, గ్యాస్ వంటి ఇతర సమస్యలు కూడా వస్తాయని డైటీషియన్ అంటున్నారు.

పెరుగు శరీరానికి ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, ఇందులో లాక్టిక్ ఆమ్లం ఉన్నందున ఖాళీ కడుపుతో తినడం అంత మంచిది కాదు.

పరగడుపున లాక్టిక్ ఆమ్లం ఉన్న ఆహారాలు తీసుకుంటే కడుపులో అసౌకర్యంతో అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది.

అరటిపండు కూడా ఖాళీ కడుపుతో తినడం అంత మంచిది కాదు. ఇది శరీరంలో ఆకస్మిక మెగ్నీషియం స్థాయి పెరుగుదలకు కారణం అవుతుంది. దీంతో గుండె సమస్యలు వస్తాయి.

అలాగే కారంగా, నూనెతో చేసిన ఆహారాన్ని పరగడుపున తీసుకోవద్దు. ఇది ప్రేగులలో చికాకు, కడుపు తిమ్మిర్లు, వాంతులకు కారణం కావచ్చు.

ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగడం హానికరం. వీటిలో కెఫిన్ కడుపులో ఆమ్లత్వాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు.