చలికాలంలో వేరుశనగ తింటే.. ఆ రోగాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టినట్టే..
Prudvi Battula
Images: Pinterest
02 November 2025
వేరుశెనగ పప్పులో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు.
పోషకాలు పుష్కలం
వేరుశనగ గింజలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీనిలో ప్రోటీన్, విటమిన్లు అధికంగా లభిస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
వేరుశనగలో ఉండే ప్రోటీన్స్ చలికాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆరోగ్యంగా ఉంచేందుకు
వేరుశెనగలో మోనోఅన్శాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి.
శరీరానికి మేలు
ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు వేరుశనగ పప్పులను తినవచ్చు.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
అలసినట్లు అనిపించడం, నిద్రమత్తుగా ఉండటం వంటి లక్షణాలు కన్పిస్తే తక్షణ శక్తి కోసం కాసిన్ని వేరుశెనగ పలుకులు తింటే సరి.
తక్షణ శక్తి
శీతాకాలంలో తరుచూ వేరుశనగలు తీసుకోవడం వల్ల శరీరంలో ఎముకలను బలోపేతం చేయడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి.
ఎముకలు బలోపేతం
వేరుశనగల్లో ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చలికాలపు అలసట నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
చలికాలపు అలసట
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ ఫుడ్స్ చీమలకు ఆహారంగా పెడితే.. అదృష్టం వరిస్తుంది..
పసుపు జుట్టు సమస్యలపై యమపాశం.. ఇలా తీసుకుంటే అన్ని ఖతం..
ఒత్తిడిని లైట్ తీసుకుంటున్నారా.? సంతానోత్పత్తిపై ఎఫెక్ట్..