బీకేర్‌ఫుల్.. మీ ఇంట్లో పని మనిషికి ఈ విషయాలు తెలియనివ్వకండి!

samatha 

06 february 2025

Credit: Instagram

ఇంట్లో పనిమనిషి ఉండటం అనేది చాలా కామన్. ప్రస్తుతం చాలా మంది ఇంట్లో పని చేయడానికి ఓ మనిషిని పెట్టుకుంటున్నారు.

ముఖ్యంగా ఇంట్లో భార్య, భర్త ఇద్దరూ పని చేస్తూ ఉంటే వారు తప్పని సరిగా ఇంట్లో పనిమనిషిని నియమించుకుంటారు.

అయితే మన ఇంటి  పని మనిషి విషయంలో కొన్ని సందర్భాల్లో యజమానులు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు నిపుణులు.

ఎందుకంటే ఈ రోజుల్లో పని మనుషులు యజమానులతో చాలా చనువుగా, కలిసిపోయి ఉంటున్నారు. దీంతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటున్నారు.

అయితే యజమానులు పనిమనిషి తో అన్ని విషయాలు షేర్ చేసుకోకూడదంట. ముఖ్యంగా డబ్బు గురించి, సంపాదన గురించి తెలియనివ్వకూడదంట.

మీరు మీ ఇంట్లో ఏ సమయంలో ఉండరు, ఎప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఎప్పుడు ఇంటికి వస్తారు అనే పూర్తి సమాచారం వారికి తెలియనివ్వకూడదంట.

ఇంకా మీ పిల్లలకు సంబంధించిన విషయాలను కూడా వారికి ఎక్కువ తెలియనివ్వకూడదంట. దీని వలన సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది.

అలాగే మీరు కొనుగోలు చేసే వస్తువులు, మీ ఇంట్లో ఉన్న వస్తువులు, కొన్నిపరికరాల పాస్ వర్డ్స్ ఇలా చాలా విషయాల్లో మీ పనిమనిషితో జాగ్రత్తగా ఉండాలంట.