డబ్బును పొదుపు చేసుకోవాలని మన పెద్దవారు చెబుతుంటారు. కానీ చాలా మంది సరదాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతుంటారు.
ఇంకొంత మంది డబ్బును ఎంత పొదుపు చేద్దాం అని అనుకున్నా, వారికి తెలియకుండానే మనీ ఖర్చు అయిపోతూ ఉంటుంది.
అయితే కొన్ని టిప్స్ పాటించడం వలన మనీ మనం ఈజీగా మనీ సేవ్ చేసుకొవచ్చంట. కాగా, ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎప్పుడూ ట్రెండీగా, లైఫ్ స్టైల్ మెయింటెన్ చేయాలి అనుకునే వారి డబ్బు ఖర్చు అవుతూనే ఉంటుందంట. అందుకే లైఫ్ స్టైల్ కోసం ఎక్కవ డబ్బు ఖర్చు పెట్టకూడదు.
ఇక కొంత మంది భవిష్యత్తు మర్చిపోయి, రేపటి కోసం డబ్బు దాచడం అనే విధానాన్ని పట్టించుకోవడం లేదు. కానీ మీ సంపాదనలో కొంత మనీ సేవింగ్ చేయాలంట.
డబ్బు పొదుపు చేయాలి అనుకునే వారు తప్పకుండా కొంత ఇన్వెస్ట్ చేయాలంట. దీని వలన ఇంట్రెస్ట్ పెరగడం వలన డబ్బు ఆదా అవుతుంది.
డబ్బు పొదుపు చేసుకోవాలి అనుకునేవారు క్రెడిట్ కార్డ్స్‌కు దూరంగా ఉండాలి. దీని వలన ఎక్కువ ఖర్చు అవుతుందంట.ఖర్చు చేసి బిల్ క్లియర్ చేయడంలో సమస్యలు వస్తాయి. అందుకే వీటిని ఎక్కువ వాడకూడదు.
మీరు ప్రతి నెల దేనికి ఎంత ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నారో లెక్కలు వేసుకోవాలి. దీని వలన మీరు ఖర్చులు తగ్గించి పొదుపు చేసుకోవచ్చు.