ఒకప్పుడు దేశంలో రాజస్థాన్, మధ్యప్రధేశ్లలో అత్యధికంగా గాడిదలు ఉండగా గడిచిన మూడు దశాబ్దాల్లో మధ్యప్రదేశ్‌లో గాడిదల సంఖ్య 94 శాతంకి దారుణంగా పడిపోయింది.
గాడిదల సంఖ్య
మధ్యప్రదేశ్‌లో గాడిదల సంఖ్య ఆందోళనకరంగా తగ్గడానికి చైనాయే కారణం అంటున్నారు గురుగ్రామ్ జంతు హక్కుల కార్యకర్తలు.
గురుగ్రామ్ జంతు హక్కుల కార్యకర్తలు
1997లో 49వేల 289 గాడిదలతో రాజస్థాన్ తర్వాత అతి ఎక్కువ రాష్ట్రంగా మధ్య ప్రదేశ్ ఉంది. ఇప్పుడు తొమ్మిది జిల్లాలలో ఒక్క గాడిద కూడా లేదని రిపోర్టులు చెబుతున్నాయి.
మధ్య ప్రదేశ్
మధ్యప్రదేశ్‌లో గడిచిన మూడు దశాబ్దాలు గాడిదల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ కేవలం 3వేల 052 గాడిదలు మాత్రమే ఉన్నాయి.
గడిచిన మూడు దశాబ్దాలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గాడిదలు అంతరించి పోవడానికి చైనాయే ప్రధాన కారణమని అన్నారు అక్కడి జంతు హక్కుల కార్యకర్త కద్యన్.
చైనాయే ప్రధాన కారణం
చైనాలో తయారు చేసే సాంప్రదాయ టానిక్స్, వయాగ్రాలాంటి మందులు ,యాంటీ ఏజింగ్ క్రీములలో వాడే జెలటిన్‌ను కోసం గాడిద చర్మాలను ఉపయోగిస్తారట.
జెలటిన్ తయారీ
చైనాలో ఎజియావో ఇండస్ట్రీ వృద్ధితో గాడిద చర్మాలకు డిమాండ్ ఎక్కువైంది. మధ్యప్రదేశ్ నుంచి గాడిదలను దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపణ.
ఎజియావో ఇండస్ట్రీ వృద్ధి
గాడిద సంఖ్యలో తీవ్రమైన క్షీణతను తెలియజేయడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ.. నరేష్ కద్యన్ గాడిదలను తదుపరి అంతరించిపోతున్న జాతిగా ప్రకటించాలని పిలుపునిచ్చారు.
తీవ్రమైన క్షీణత
తాజా పశువుల జనాభా గణన కూడా గాడిదల సంఖ్య తగ్గిపోతుందని తేల్చింది. మధ్యప్రదేశ్‌లో 3.75 కోట్ల జంతువులు ఉండగా.. అందులో గాడిదలు, 3వేల052, కంచర గాడిదలు 972 ఉన్నాయని తేలింది.