నెయ్యి తింటే.. బరువు పెడుతుందా.? ఇందులో వాస్తవాలు ఏంటి.? 

Prudvi Battula 

Images: Pinterest

04 November 2025

నెయ్యిలో పోషకాలు ఉన్నప్పటికీ చాలా మంది నెయ్యి తీసుకుంటే దుష్ప్రభావాలు కలుగుతాయని, బరువు పెరుగుతారనే భావనలో ఉంటారు.

బరువు పెరుగుతారనే భావన

నెయ్యి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారనేది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. మితంగా తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

కేవలం అపోహ మాత్రమే

ముఖ్యంగా రోజువారీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం ద్వారా రోజంతా చురుకుగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

రోజంతా చురుకుగా ఉండొచ్చు

మరీ ముఖ్యంగా స్త్రీలు గర్భం సమయంలో నెయ్యి తీసుకుంటే ఎంతో పుట్టబోయే శిశువుకి మేలు జరుగుతుందని అంటున్నారు.

గర్భిణులకు మేలు

నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మం మాయిశ్చరైజర్‌ను కాపాడుతాయి. ముఖంలో నిగారింపు రావాలంటే ప్రతీరోజూ కచ్చితంగా నెయ్యిని తీసుకోవాలి.

చర్మనికి ఆరోగ్యం

మహిళలు తమ పీరియడ్స్‌ సమయంలో నెయ్యిని తీసుకొంటే హార్మోన్లను బ్యాలెన్స్‌ చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

హార్మోన్లను బ్యాలెన్స్‌

నెలసరి క్రమంగా రాని వారికి నెయ్యి దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. నెయ్యిలో విటమిన్‌ కే పుష్కలంగా లభిస్తుంది. ఇది కాల్షియం శోషణలో సహాయపడుతుంది.

కాల్షియం శోషణ

దంత క్షయాన్ని నివారించడానికి, అథెరోస్ల్కెరోసిస్‌ రాకుండా ఎముకలను బలంగా ఉంచడానికి నెయ్యి తోడ్పడుతుంది.

ఎముకలను బలం