విమాన ప్రమాదంలో కీలకమయ్యే బ్లాక్ బాక్స్ ఆరెంజ్ కలర్‌లో ఎందుకుంటుందో తెలుసా?

samatha 

16 JUN  2025

Credit: Instagram

రీసెంట్‌గా ఏరిండియా విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు.

ఎయిరిండియా 787 డ్రీమ్ లైనర్ విమానం 242 మందితో లండన్ బయల్దేరింది. అది టేకాఫ్ అయిన కొద్ది సేపటికే అందులో సాంకేతిక సమస్య తలెత్తింది.

 ఫైలెట్ మేడే కాల్ చేశారు. ఆ కొద్దిసేపటికే రద్దీగా ఉండే నివాస ప్రాంతాల్లో ఉన్న ఓ డాక్టర్స్ హాస్టల్‌పై విమానం కూలి పెను ప్రమాదం సంభవించింది.

దీంతో ఇప్పుడు అందరూ బ్లాక్ బాక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. విమాన ప్రమాదంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంటుంది.

దీనిని విమానం వెనుక బాగంలో అమర్చుతారు. ఇది  విమానం నీటిలో మునిగినా, అధిక ఉష్ణోగ్రతల్లో ప్రయాణించినా, ఈ బ్లాక్ బాక్స్ చాలా బలంగా ఉంటుంది.

 అంతే కాకుండా  విమానంలో జరిగే ప్రతి అంశం, రేడియో ట్రాఫిక్, పైలెట్ అనౌన్స్మెంట్ లు, ప్రైవేట్ సంభాషణలు అన్నీ ఇందులో రికార్డ్ అవుతాయి.

ఎలాంటి ప్రమాదం జరిగినా? దానికి సంబంధించిన కారణాలు, ఫైలెట్ అనౌన్స్ మెంట్స్ వారి సంభాషణల ద్వారా విషయం తెలసుకోవచ్చు.

అయితే ఈ బ్లాక్ బాక్స్ అనేది ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పేరు బ్లాక్ బాక్స్ అని ఉండి కలర్ మాత్రం ఆరెంజ్‌‌లో ఉందని?

అయితే దీనిక కారణం ఉన్నదంట. విమానప్రమాద జరిగినప్పుడు మంటల్లో అన్ని మాడిపోయి నలుపు రంగులో ఉంటాయి. దీనిని గుర్తించడం కష్టం, ఈజీగా గుర్తుపట్టడానికి ఆరెంజ్ కలర్ ఉపయోగిస్తారంట