మరణించిన వారి ఏ వస్తువులు వాడకూడదో తెలుసా?

Samatha

28 August  2025

Credit: Instagram

చావు పుట్టుకలు అనేవి చాల సహజం. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. మరణించిన వారు పుట్టక తప్పదు అనే నానుడి అందరికీ తెలిసిందే.

 అయితే మన పెద్ద వారు చెబుతుంటారు. చనిపోయిన వారి వస్తువులు కొన్నింటిని అస్సలే వాడకూడదని. మరి వాటిని వాడి ఏం జరుగుతుందో చూద్దాం.

వ్యక్తి చనిపోయిన తర్వాత వారి జ్ఞాపకాలతో పాటు వారికీ సంబంధించిన వస్తువులు మనతోనే ఉంటాయి. వాటిని ఇతరులు ఉపయోగించాలా? వద్దా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది

అయితే నిపుణుల ప్రకారం, చనిపోయిన వారి ఆభరణాలు ధరించకూడదంట. వీటిని వారి గుర్తుగా దాచుకోవాలి అంతేనంట.

మరణించిన వ్యక్తి మరణానికి ముందు ఆభరణాలు మీకు బహుమతి గా ఇచ్చినట్లు అయితే  వాటిని ధరించడంలో తప్పు లేదంట.

 ప్రత్యేకించి మరణించిన వ్యక్తి దుస్తువులను కుటుంబ సభ్యులు ధరిస్తే చెడు ప్రభావం కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

తెలియని వ్యక్తులకి వాటిని ఇవ్వడం దానం చేయడం వంటివి చేయాలి. అలాగే పొరపాటున కూడా మరణించిన వ్యక్తి వాచ్ ని ధరించకూడదు.

మరణం తర్వాత కూడా ఆత్మ అనేది వారి వస్తువులపై ఉంటుంది. దీని వలన ఆత్మ అనేది మిమ్మల్ని ఆకర్షిస్తుందంట.