వాలెంటెన్స్ వీక్.. ఏ రోజు ఏ ప్రత్యేకతో తెలుసుకోండి ఇలా! 

samatha 

04 february 2025

Credit: Instagram

ప్రేమికులకు ఎంతో ఇష్టమైన వాలెంటైన్స్ డే వచ్చేస్తుంది. దీంతో ప్రేమికులు తమ భాగస్వాములను సర్ప్రైజ్ చేయాలని చూస్తుంటారు.

కాగా, వాలెంటెన్స్ వీక్ ఏ రోజు ప్రారంభం అవుతుంది? ఏ రోజు ఏ ప్రత్యేకతనో తెలుసుకొని మీ ప్రియురాలు లేదా ప్రియుడిని గిప్ట్స్‌తో సంతోష పరచండి.

 ఫిబ్రవరి 7 : వాలెంటైన్స్ డే రోజ్ డేతో ప్రారంభం అవుతుంది. ఈ రోజు మీకు ఇష్టమైన గులాబీని మీ ప్రియురాలికి ఇచ్చి ఆశ్చర్యపరచండి.

ఫిబ్రవరి8 : ప్రపోస్ డే..చాలా కొత్తగా మీ క్రష్‌ను ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేయండి.మీరు చేసే ప్రపోజ్ తనకు జీవితాంతం గుర్తు ఉండిపోవాలి.

ఫిబ్రవరి 9: చాక్లెట్ డే .. ఈరోజు అమ్మాయిలకు చాలా ఇష్టం. ఇక వారికి ఇష్టమైన చాక్లెట్ గిఫ్ట్‌గా ఇచ్చి మీ ప్రేమలో మాధుర్యాన్ని తెలపండి.

ఫిబ్రవరి 10: టెడ్డీ డే.. మీకు ఇష్టమైన టెడ్డీని గిఫ్ట్‌గా ఇచ్చి మీ క్రష్‌ను ఆనంద పరచండి, రోజు మొత్తం చాలా ఆనందంగా గడపండి.

 ఫిబ్రవరి 11: ప్రామిస్ డే, మీ లవర్‌కి తోడుగా ఉంటానంటూ ప్రామిస్ చేయండి, ఫిబ్రవరి 12 హగ్ డే, హగ్‌తో మీ బంధాన్ని బలంగా మల్చుకోండి

 ఫిబ్రవరి 13 : కిస్ డే, ముద్దుతో మీ బంధాన్ని బలోపేతం చేసుకోండి.ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే,ప్రేమికులుగా మీతో మీరు ఆనందంగా గడపండి.