ప్రపంచంలోనే చంద్రుడు మొదట ఎక్కడ కనిపిస్తాడో తెలుసా?

17 october 2025

Samatha

చందమామ అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే ఈయన వచ్చాడంటే చాలు చల్లదాన్ని తీసుకొస్తాడు.  చీకటిలో వెలుతురినిస్తూ.. అందరినీ తన వైపుకు ఆకర్షించుకుంటాడు.

ఇక రాత్రి సమయంలో వచ్చే ఈ చంద్రుడి గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాగా, తాజాగా చంద్రుడికి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?

చంద్రుడికి సొంత కాంతి కిరణాలు ఉండవు.  భూమి లాగానే చంద్రుడు కూడా సూర్యుడి నుంచి వచ్చేకాంతిని ప్రతిబింబిస్తాడు.  అందుకే చంద్రుడు ప్రకాశిస్తూ కనిపిస్తాడు.

అయితే చాలా మందికి ఉండే అది పెద్ద డౌట్ ఏమిటంటే? అసలు చంద్రడు మొదట ఏ ప్రదేశలో కనిపిస్తాడు. కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

ప్రపంచంలో సూర్యుడు మొదట ఎక్కడ అస్తమిస్తాడు అక్కడే చంద్రుడు మొదట కనిపిస్తాడంట.  కాగా, ఇప్పుడు మనం చంద్రుడు మొదట కనిపించే ప్రదేశం ఏదో చూద్దాం.

ప్రపంచంలోనే చంద్రుడు మొదటగా కిరిబాటి అనే ద్వీపంలో ఉదయిస్తాడంట.  ఇది న్యూజిలాండ్ సమీపంలో ఉంటుంది. ఈ ద్వీపం యూటీసీ ప్లస్ 14 సమయ మండలంలో నడుస్తుంది.

ఇక దీని తర్వాత చంద్రుడు మొదటగా కనిపించే రెండవ దేశాల్లోకి వెళితే, టోంగా , సమోవా, వంటి దేశాల్లో చంద్రుడు మొదటగా కనిపిస్తాడంటున్నారు నిపుణులు.

అంటే ప్రపంచంలో చంద్రుడు మొదటగా ఉదయించే ప్రాంతం అంటే కిరిబాటి ద్వీపం. ఇక్కడే సూర్యుడు మొదటగా అస్తమిస్తాడు.