పాములు భయపడేది వీటికే.. చూస్తేనే పారిపోతాయంట!

Samatha

19 august  2025

Credit: Instagram

పాములంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. చాలా మంది పాములను చూసి ఆమడ దూరం పారిపోతుంటారు. కొందరు పాము పేరు చెబితేనే వణికిపోతారు

ఇక కొంత మంది అయితే ఏకంగా వాటిని కలలో చూసినా కూడా వణికిపోతుంటారు. మరి మనుషులే పాములకు భయపడతారా?

పాములకు భయం ఉండదా? అవి వేటికి భయపడవా అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కాగా, ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

పాములకు కూడా భయం ఉంటుంది. అవి కొన్నింటిని చూస్తే వాటికి భయపడి దూరంగా పారిపోతాయంటున్నారు నిపుణులు. అవి ఏవి అంటే?

పాములు నెమలి ఈకలను చూస్తే వణికిపోతాయంట. వాటిని చూసి ఆమడ దూరంపారిపోతాంట. అలాగే వెల్లుల్లి రెబ్బలకు ఇవి భయపడతాయి.

వెల్లుల్లి వాసన పాములకు అస్సలే నచ్చదంట.ఉల్లి ముక్కలు చూస్తే అవి పారిపోతాయంట. అగరబత్తీల పొగకు కూడా అవి దూరం పారిపోతాయంట.

అద్దం మెరుపులంటే పాములకు చాలా భయమంట. వాటిని చూస్తే అవి చాలా దూరం పారిపోతాయి అంటున్నారు నిపుణులు.

అలాగే కాఫీ పౌడర్ స్మెల్ పాములకు అస్సలే నచ్చడంట. పాములు కాఫీ పౌడర్ వాసన, హారతి కర్పూర బిల్లల స్మెల్‌కు చాలా దూరం ఉంటాయి.