మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా?
TV9 Telugu
24 January
202
5
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు నేపాల్ ప్రభుత్వం అనుమతుల ఫీజులను పెంచింది.
ఇప్పుడు నేపాల్ దేశంలో ఉన్న ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించాలంటే మీరు లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది.
విదేశీయులకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు రుసుమును నేపాల గవర్నమెంట్ 36 శాతం పెంచినట్లు సమాచారం.
ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు విదేశీ పర్వతారోహకుల రుసుమును 11 వేల అమెరికన్ డాలర్ల నుంచి 15 వేల అమెరికన్ డాలర్లకు పెంచారు.
భారత కరెన్సీలో చూస్తే గతంలో ఎక్కడానికి దాదాపు రూ.8 లక్షల 80 వేల రూపాయల వరకు ఉంటే ఇప్పుడు రూ.13 లక్షలు అవుతుంది.
8848.86 మీటర్ల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించడానికి కొత్త రుసుములు సెప్టెంబర్ 1, 2025 నుండి వర్తిస్తాయని నేపాల్ అధికారి తెలిపారు.
అంతే కాకుండా నేపాల్ దేశ ప్రభుత్యం క్లైంబింగ్‌కు 75 రోజుల అనుమతిని 55 రోజులకు కుదించనున్నట్లు సమాచారం.
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు ఏటా దేశ విదేశాల నుండి సాహసవంతులు వెళ్తూ ఉంటారు. కొంతమంది మాత్రమే గమ్యాన్ని చేరుకుంటారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఏ వయస్సు వారు రోజుకు ఎన్ని గంటలు నిద్రించాలో తెలుసా?
తిన్న వెంటనే గ్రీన్ టీ తాగుతున్నారా.? ఆ సమస్యలు వచ్చే అవకాశం..
జామ ఆకులు ఆ సమస్యలకు ఔషదం..