గుడ్డును ఎంత సేపు ఉడికిస్తే ఆరోగ్యమో తెలుసా.?
19 September 2025
Prudvi Battula
మీరు గుడ్డు మెత్తగా ఉడికించలనుకుంటే 6-7 నిమిషాలు సరిపోతుంది. ఇందులో పచ్చసొన కాస్త ద్రవంలా ఉంటుంది. తెల్లసొన గట్టిపడుతుంది.
అదే గుడ్డు మీడియం ఉడికించాలంటే మాత్రం 8-9 నిమిషాలు స్టవ్ మీద ఉంచాలి. ఈ స్టయిలో పచ్చసొన కొద్దిగా గట్టిగా, తెలుపు పూర్తిగా గట్టిపడుతుంది.
మీరు గుడ్డును గట్టిగా ఉడకబెట్టలనుకుంటే మాత్రం 10-12 నిమిషాలు స్టవ్‌పై ఉంచాలి. ఇప్పుడు పచ్చసొన, తెలుపు పూర్తిగా గట్టిపడి గట్టిగా ఉంటాయి.
గుడ్లను ఎక్కువసేపు ఉడకబెట్టడం వల్ల పోషకాలు పోతాయి. ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్ బి, సి వంటివి నష్టపోతారు.
సరిగ్గా ఉడికించని గుడ్లు సాల్మొనెల్లా కలుషిత ప్రమాదాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు హానికరం.
పాత గుడ్లను ఉడకబెట్టడానికి వాడండి. ఎందుకంటే వాటి తొక్క తీయడం సులభం అవుతుంది. కొత్త గుడ్లు తొక్క త్వరగా రాదు.
గుడ్లు ఉడికిన తర్వాత వాటిని ఐస్ బాత్‌లో సోక్ చేస్తే ఉడికే ప్రక్రియ ఆగి వాటి తొక్క సులభంగా తొలగిపోతుంది.
మీరు ఉడికించిన గుడ్లను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయాలనుకుంటే మాత్రం వారంలోపు తినాలి. లేదంటే అనారోగ్యం బారిన పడతారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
పితృ పక్షం రోజున ఇలా చేస్తే.. పితృ దోషం నుంచి ఉపశమనం..
ఎండు చేపలు పోషకాల భాండాగారం.. డైట్లో ఉంటే.. అనారోగ్యంపై దండయాత్రే..
విటమిన్ డి సహజంగా పెరగాలంటే ఏం చేయాలి?