చక్కెర ఎక్కువ తింటున్నారా.. వామ్మో మీ లైఫ్ డేంజర్‌లో పడ్డట్లే !

samatha 

07 JUN  2025

Credit: Instagram

చక్కెర అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే ఎక్కువ మంది మంచి స్వీట్ తీసుకుంటూ ఉంటారు. అయితే అతిగా చక్కెర తీసుకోవడం వలన అనేక సమస్యలు వస్తాయంట.

కాగా, చక్కెర ఎక్కువగా తినడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం. వైట్ షుగర్ ఆరోగ్యానికి అస్సే మంచిది కాదంట. అందుకే దీనికి చాలా దూరం ఉండాలంటున్నారు వైద్యులు.

కొంత మంది టీ లేదా పాలు, ఇతర స్వీట్స్ చేసుకునే సమయంలో ఎక్కవ మోతాదులో వైట్ షుగర్ వేసుకుంటారు. కానీ దీని వలన అనేక సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

ఎక్కువ మోతాదులో వైట్ షుగర్ తీసుకోవడం వలన అది మెదడు పై తీవ్ర ప్రభావం చూపిస్తుందంట. అంతే కాకుండా దీని వలన మన మెదడులోని డొపమైన్ విడుదలకు కారణం అవుతుందంట.

వైట్ షుగర్ ఎక్కువ మోతాదులో తినడం వలన అధికంగా బరువు పెరుగుతారంట. దీని వలన భవిష్యత్తులో ఊబకాయం వంటి అనేక సమస్యలు ఎదుర్కోక తప్పదంటున్నారు నిపుణులు.

అలాగే అధిక చక్కెర వలన గుండె జబ్బుల బారిన పడే ఛాన్స్ ఉన్నదంట. ఎక్కువ చక్కెర తీసుకోవడం వలన ఇది రక్తప్రసరణలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుందంట.

అందువలన ఇది అధిక రక్తపోటు,గుండె పోటుకు కారణం అవుతుందంట. అందుకే చక్కెరకు చాలా వరకు దూరం ఉండాలంట. ఎందుకంటే ఇది లివర్ పై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుందంట.

ఇవే కాకుండా ఎక్కువ మొత్తంలో చక్కెర వాడటం వలన చర్మ సమస్యలు కూడా ఎదర్కోక తప్పదంట. ముఖంపై మడతలు పడటం వంటి సమస్యలు, త్వరగా వృధ్యాప్య ఛాయలు వస్తుంటాయంట.