ఆకాశంలో మెరిసే ఈ అందమైన పక్షులను మీరెప్పుడైనా చూశారా?

samatha 

19 JUN  2025

Credit: Instagram

రెస్పెండెంట్ క్వెట్జల్ అందమైన పక్షుల్లో ఇదొకటి. చూడటానికి చిలుక మాదిరి కనిపించినా, దీని తోక మాత్రం చాలా పొడువుగా ఉంటుంది. ఆకుపచ్చ,ఎరుపు రంగుతో ఆకాశంలో మెరుస్తూ కనిపిస్తుంది.

ఇంద్రధన్సు రంగులతో వావ్ అనిపించేలా ఉండే పక్షి హిమాలయన్ మోనాల్. ఇది నేపాల్ జాతీయ పక్షి. ఇది ఆకాశంలో ఎగిరినప్పుడు చాలా మెరుస్తూ కనిపిస్తుంది.

మెరిసే అందమైన పక్షుల్లో బ్లూ జే పక్షి ఒకటి. ఇది నీలి రంగు ఈకలతో చాలా అందంగా ఉంటుంది. అమెరికాలోని అడువుల్లో ఈ పక్షులు ఆకాశంలో మెరుపులా కనిపిస్తాయి.

రంగు రంగుల చిలుక అంటే అందరికీ గుర్తు వచ్చేది స్కార్లెట్ మకావ్. ఇది పసుపు, ఎరుపు, నీలి రంగుతో అందంగా ఉంటుంది. ఎండకు మెరుస్తూ కనిపిస్తుంది.

లేత ఆకుపచ్చ,నీలం, పసుపు రంగు ఈకలతో చూడటానికి చాలా అందంగా కనిపించే పక్షి పారడైజ్ టానేజర్. ఇది ఆకాశంలో ఎగిరినప్పుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంటది.

కింగ్ ఫిషర్ పక్షి. ఇధి చేపలను వేటాడేందుకు సూర్యకాంతితో నిండిన నదుల్లోకి దూకుతున్నప్పుడు చాలా మెరిస్తూ కనిపిస్తుంది.

ఆఫ్రికన్ అందం అంటే లిలక్ బ్రెస్టెడో రోలర్. అందమైన పక్షుల్లో ఇదొకటి, ఇది రంగు రంగుల ఈకలతో ఆకాశంలోకి ఎగిరినప్పుడు మంచి మెరుపును ఇస్తుంది.

ప్రకాశవంతమైన పక్షుల్లో భారతీయ నెమలి ఒకటి. ఇది మెరుపునిచ్చే లేత ఆకుపచ్చ రంగు ఈకలతో, అలాగే నీలిరంగు తల భాగంతో చూడటానికి చాలా అందంగా ఉంటుంది.