ఈ లక్షణాలు ఉన్నాయా.? కిడ్నీలో రాళ్ళ సమస్య కావచ్చు.. 

Prudvi Battula 

Images: Pinterest

22 October 2025

కిడ్నీలో రాళ్ళు అనేవి మూత్రపిండాలు లేదా మూత్ర నాళంలో ఏర్పడే చిన్న స్ఫటిక లాంటి ఘనపదార్థాలు. కొన్ని లక్షణాల ద్వారా ఈ సమస్యను మనం గుర్తించవచ్చు.

మూత్రపిండాల్లో రాళ్లు

కొందమందిలో తరుచూ వెన్నునొప్పి, వెనుక పక్కటెముకలలో విపరీతమైన నొప్పి వస్తుంది. మూత్రపిండాల రాళ్ళు  వల్ల ఏర్పడే ఒత్తిడి ఈ తీవ్రమైన నొప్పికి కారణమవుతుంది.

పక్కటెముకలలో నొప్పి

మీరు మూత్ర విసర్జన చేసినప్పుడు, మూత్ర నాళంలోని రాళ్ళు కదలడం ప్రారంభించి, మూత్ర నాళంలో ఘర్షణకు కారణమవుతాయి. ఈ ఘర్షణ చికాకును కలిగిస్తుంది.

మూత్ర విసర్జన చేసేటప్పుడు మండుతున్న అనుభూతి

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు తరచుగా జలుబు, ఫ్లూ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే, ఈ జ్వరం కేవలం కిడ్నీ సమస్యల వల్లే వస్తుందని మనం చెప్పలేం.

చలి జ్వరం

మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఎదుర్కొంటున్న వారి మూత్రంలో రక్తం కనిపిస్తుంది. ఈ రక్తం ఎరుపు, గులాబీ లేదా గోధుమ రంగులో ఉండవచ్చు.

మూత్రంలో రక్తం

మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి మూత్రం నుంచి దుర్వాసన వస్తుంది. ఇది కూడా మూత్రనాళ ఇన్ఫెక్షన్‌కు సంకేతం.

దుర్వాసనతో కూడిన మూత్రం.

మూత్రపిండాల్లో రాళ్ల వల్ల మూత్ర నాళంలో మూసుకుపోవడం వల్ల మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది కలుగుతుంది. కొన్నిసార్లు మూత్రన్ని అడ్డుకోవడం వల్ల రాళ్లు ఏర్పడతాయి.

తక్కువ మూత్రం

మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి వికారం, వాంతులు రావడం సహజం. మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థ మధ్య నరాలపై ఒత్తిడి పెరగడం వల్ల వికారం, వాంతులు వస్తాయి.

వికారం, వాంతులు

మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు తరచుగా మూత్ర విసర్జన చేయడానికి సాధారణం కంటే ఎక్కువసార్లు బాత్రూమ్‌కు వెళతారు.

తరచుగా మూత్రవిసర్జన