సిట్రస్ పండ్లు అధికంగా తింటే.. అనారోగ్యానికి బాడీలో ఇల్లు కట్టినట్టే..

19 September 2025

Prudvi Battula 

సిట్రస్ పండ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉన్నందున అధిక వినియోగం యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యానికి దారితీస్తుంది.

సిట్రస్ పండ్లలో అధిక సిట్రిక్ యాసిడ్ కంటెంట్ దంతాల ఎనామిల్‌ను క్షీణింపజేస్తుంది. దీనివల్ల దంతాలు క్షయం, సున్నితత్వానికి గురవుతాయి.

వీటిను ఎక్కువ మొత్తంలో తీసుకుంటే సున్నితమైన కడుపు ఉన్నవారిలో ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.

ముఖ్యంగా పంపర పనస, స్టాటిన్స్ వంటివి మందులు కొట్టి పెంచుతారు. వీటిని ఎక్కువ తినడం అనారోగ్య సమస్యలను పెంచుతుంది.

సిట్రస్ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల కొంతమంది వ్యక్తులల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.

కొంతమందికి అలెర్జీ ఉండవచ్చు. అలాంటివారు వీటిని అధికంగా తింటే దద్దుర్లు, దురద లేదా వాపు వంటి అలెర్జీ ప్రతిచర్యలను ప్రేరేపిస్తుంది.

పంపర పనసలోని బెర్గాప్టెన్ వంటి సమ్మేళనాలు ఫోటోటాక్సిసిటీని కలిగిస్తాయి. ఇవి చర్మ సున్నితత్వం, వడదెబ్బ ప్రమాదాన్ని పెంచుతాయి.

సిట్రస్ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల కాల్షియం శోషణకు అంతరాయం కలుగుతుంది. కాలక్రమేణా ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.