బీరకాయ కదా అని పక్కన పెట్టేస్తే.. నష్టం మీకే.. 

Prudvi Battula 

14 September 2025

బీరకాయలో పోషకాలు పుష్కలంగా నిండి ఉన్నందున అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.

ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

బీరకాయలో అదికంగా ఉన్న విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు దరిచేరవు.

బీరకాయలోని తక్కువ కేలరీల కంటెంట్, అధిక ఫైబర్ అధిక బరువును తగ్గించడానికి సహాయపడుతుందని అంటున్నారు నిపుణులు.

బీరకాయలోని పొటాషియం కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

బీరకాయలో కేలరీలు తక్కువగా ఉన్నందున డయాబెటిక్ రోగులకు ఇది మంచి అప్షన్. వారి ఆహారంలో హ్యాపీగా చేర్చుకోవచ్చు.

దీనిలో అధిక నీటి శాతం శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే డిహైడ్రేషన్‌ కాకుండా సహాయపడుతుంది.

ఇది తిన్న తర్వాత కొంతమందికి దురద, వాపుదా కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల, అలెర్జీలు ఉన్నవారు వీటిని తినకూడదు.