ఎండు ద్రాక్షను లైట్ తీసుకోవద్దు.. ఆ సమస్యలకు కాల యముడు.. 

20 September 2025

Prudvi Battula 

ద్రాక్షను ఎండబెట్టి ఎండుద్రాక్షని తయారుచేస్తారు. వీటిని కేకులు, ఖీర్, బర్ఫీ వంటి అనేక రకాల డెజర్ట్‌ల కోసం వాడుతారు.

ఎండుద్రాక్షలు జుట్టు సమస్యల నుంచి మలబద్ధకాన్ని దూరం చేయడం వంటి లెక్కలేనన్ని ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

ఎండుద్రాక్షలో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉన్నందున ఎముకల వ్యాధి నివారణకు సహాయపడుతుంది. దీంతో ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఎండుద్రాక్షలో అనేక సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇవి బోలు ఎముకల వ్యాధి సమస్యను దూరం చేయడంలో ఎంతగానో సహాయపడతాయి.

మీరు ఎండుద్రాక్ష తరచూ తినడం వల్ల జుట్టు పొడిబారడం, చీలిపోవడం వంటి సమస్యలు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

వీటిలో ఎక్కువగా లభించే విటమిన్ సి ఖనిజాలను వేగంగా గ్రహించడంలో సహాయపడుతుంది. దీంతూ శరీరం ఎక్కువ శక్తిని గ్రహించగలదు.

పొటాషియం ఎక్కువగా ఉన్న ఎండుద్రాక్ష రక్తంలో సోడియంను తగ్గించి రక్తపోటును నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.