గుమ్మడి గింజలతో మోర్ బెనిఫిట్స్.. అనారోగ్యం మటాష్.. 

12 October 2025

Prudvi Battula 

గుమ్మడి విత్తనాలు మధుమేహం నుంచి రక్షిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. వీటిని తింటే స్పెర్మ్ నాణ్యతను పెరుగుతుంది.

గుమ్మడికాయ గింజల్లోని పోషకాలు గుండె జబ్బులు, క్యాన్సర్లు వంటివి రాకుండా కాపాడుతాయని అంటున్నారు నిపుణులు.

ఇందులో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ , పొటాషియం , విటమిన్ బి2 వంటి అరుదైన పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఈ గింజలు జింక్, ఇనుముతో పుష్కలంగా ఉన్నందున రోగనిరోధక వ్యవస్థకు మెరుగుపడి వ్యాదులతో పారాడటంలో సహాయపడతాయి.

వీటిలో యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాల సూక్ష్మజీవుల నుంచి మన శరీరాన్ని రక్షించడంలో ఎంతగానో సహాయపడతాయి.

దీనిలో విటమిన్ E , ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి.

గుమ్మడికాయ గింజలు యువకులలో గుండెపోటు దూరం చేస్తాయి. దీంతో మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు.

ఇన్ని లాభాల ఉన్న గుమ్మడికాయ గింజలను మీ ఆహారంలో ప్రతిరోజూ తినడం అలవాటు చేసుకొవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు వైద్యులు.