ఐస్‎క్రీమ్ లిమిట్‎లో తింటే.. ఆ సమస్యల కథ క్లైమాక్స్‎కే.. 

23 September 2025

Prudvi Battula 

ఐస్‎క్రీమ్‎లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం మెదడులో సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. మానసిక స్థితిని మెరుగుపరచి ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఐస్‎క్రీమ్‎లోని అధిక కేలరీల కంటెంట్ కారణంగా త్వరిత శక్తిని అందిస్తుంది. ఇది మనిషిలో ఉత్సాహన్ని పెంచుతుంది.

చాలా ఐస్‎క్రీములు పాలతో తయారు చేస్తారు. ఇది కాల్షియంకి మంచి మూలం. బలమైన ఎముకలు, దంతాలకు కాల్షియం చాలా అవసరం.

పెరుగుతో తయారు చేసిన కొన్ని రకాల ఐస్‎క్రీములలో పేగు ఆరోగ్యం, జీర్ణక్రియకు తోడ్పడే ప్రోబయోటిక్స్ ఉంటాయి.

పదార్థాలను బట్టి ఐస్‎క్రీమ్ విటమిన్లు A, D, B12 వంటి వివిధ పోషకాలను అందిస్తుంది. ప్రత్యేకించి అధిక నాణ్యత గల పాలు, క్రీమ్‌తో తయారు చేస్తే.

ఐస్‎క్రీమ్ తినడం వల్ల మానసిక ఒత్తిడి, రోజువారీ చింతల నుండి తాత్కాలికంగా తప్పించుకోవచ్చు. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

దంతాలు తొలగించిన తర్వాత డాక్టర్లు ఐస్‎క్రీమ్ తినమని చెబుతారు. ఎందుకంటే ఉబ్బిపోయిన చిగుళ్లను సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడుతుంది.

కొన్నిసార్లు గర్భిణులు మానసిక ఒత్తిడికి గురవుతూంటారు. అప్పుడు వైద్యుల సలహాల మేరకు ఐస్‎క్రీమ్‎ తినవచ్చు.