చాణక్య నీతి : పురుషులు సంతోషంగా జీవించేది ఇలాంటి మహిళలతోనే..
samatha
06 february 2025
Credit: Instagram
ఆచార్య చాణక్యడు గొప్ప తత్వవేత్త. ఆయన తన నీతి శాస్త్రంలో అనేక విషయాల గురించి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా స్త్రీ, పురుషుల మధ్య బంధం గురించి వివరంగా తెలిపారు.
భార్య భర్తల మధ్య బంధం బలంగా ఉండాలి అంటే ఎలా? ఎవరిని నమ్మాలి, ఎలాంటి వారితో మనుషులు ఆనందంగా ఉంటారు. ఇలా చాలా విషయాల గురించి ఆయన తెలియజేశారు.
అలాగే ఆచార్య చాణక్యుడు స్త్రీ, పురుషుల మధ్య సంబంధం గురించి? ఎలాంటి పురుషులను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతారు వంటి విషయాల గురించి కూడా వివరించడం జరిగింది.
అయితే స్త్రీలు ఈ ఐదు లక్షణాలు ఉన్న పురుషులను మాత్రమే ఎక్కవగా ఇష్టపడుతారంట. కాగా, ఆ లక్షణాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మంచి మర్యాద, మంచి ప్రవర్తన కలిగి ఉండి, అందరితో ఈజీగా కలిసిపోయి, చాలా స్వీట్‌గా మాట్లాడే అబ్బాయిలను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతారంట.
ప్రతి స్త్రీ తన భాగస్వామి తనను ఎప్పుడూ గౌరవించాలని కోరుకుంటుంది. వారు చెప్పే ప్రతి విషయాన్ని మీరు గౌరవించాలని వారు ఆశిస్తారు. ఇతరుల మాటలు ఓపికగా వినే పురుషులను స్త్రీలు ఎక్కువ ఇష్టపడుతారు.
చాణక్యుడి ప్రకారం, ఏ సంబంధంలోనైనా నమ్మకం చాలా ముఖ్యం. ఒక స్త్రీ తన గురించి ఒక రహస్యాన్ని ఒక పురుషుడికి చెబితే, అతను దానిని తనలోనే ఉంచుకుంటే, వారు మహిళల దృష్టిలో చాలా ఉన్నతస్థానంలో ఉంటారు
ఇలాంటి నమ్మకమైన పురుషులను మహిళలు చాలా ఇష్టపడతారు. తమ నమ్మకాన్ని నిలబెట్టుకునే, మాటలను నిలబెట్టుకునే పురుషులతో మహిళలు సంతోషంగా జీవిస్తారని చాణక్య చెప్పాడు.