పండ్లపై ఉన్న స్టిక్కర్లుతో వాటి నాణ్యత తెలుసుకోవచ్చా.?

Prudvi Battula 

Images: Pinterest

29 October 2025

మార్కెట్‎లో పండ్లను కొనేటప్పుడు.. వాటిపై కోడ్‌లతో ఉన్న చిన్న స్టిక్కర్‌లను చూసి ఉంటారు. ఈ చిన్న స్టిక్కర్‌లను బ్రాండింగ్ అనుకుంటారు.

పండ్లపై స్టిక్కర్‌లు

పండ్లపై కోడ్‌లతో ఉన్న చిన్న స్టిక్కర్‌లపై PLU అనే ప్రత్యేక కోడ్ ఉంటుంది. ఇది పండ్ల సాగు పద్ధతి, నాణ్యతను సూచిస్తుంది.

PLU కోడ్

ఈ స్టిక్కర్‌లపై ఉన్న PLU కోడ్ 4 లేదా 5 అంకెల పొడవు ఉంటుంది. మొదటి అంకె పండించిన పండ్ల రకాన్ని తెలుపుతుంది.

4 లేదా 5 అంకెల పొడవు సంఖ్య

PLU కోడ్‌ను ద్వారా ఆ పండు సేంద్రీయ పద్దతిలో పండించారా.? లేక రసాయనలు వాడారా.? ఇవి రెండు కాకుండా జన్యుపరంగా మార్పులు చేసారోమో తెలుసుకోవచ్చు.

పండించిన పద్దతి

'9'తో ప్రారంభమయ్యే 5-అంకెల సంఖ్య పండుపై స్టిక్కర్‌లో ఉంటే.. దీన్ని పూర్తిగా సేంద్రీయ పద్దతిలో పండించారని అర్థం.

పూర్తిగా సేంద్రీయమైనది

4-అంకెల సంఖ్య మాత్రమే ఉన్నట్లు అయితే.. పండ్ల సాగులో పురుగుమందులు, రసాయనాలు వినియోగించారని అర్థం. ఇవి చౌకగా ఉంటాయి.

రసాయనాలు వినియోగించారని అర్థం

మార్కెట్‎లో పండ్లను కొనేటప్పుడు '9' తో ప్రారంభమయ్యే 5-అంకెల సంఖ్య స్టిక్కర్‌లు ఉన్న సేంద్రీయ పండ్లను కొనండి.

సేంద్రీయ పండ్లను కొనండి

మీరు కొన్న పండు సేంద్రీయమైనది అయినా.. రసాయనాలతో పండించిన.. దానిపై బ్యాక్టీరియాను తొలగించడానికి తినడానికి ముందు బాగా కడుక్కోవాలి.

బాగా కడుక్కోవాలి