డయాబెటిస్ పేషెంట్లు చక్కెరకు బదులు బెల్లం తినొచ్చా?
14 November 2024
TV9 Telugu
TV9 Telugu
చాలా మంది బెల్లం తినడానికి ఇష్టపడతారు. ఇది లేత పసుపు రంగు, ముదురు గోధుమ రంగుల్లో ఉంటుంది. పంచదారకు బదులుగా బెల్లం తినడం ప్రయోజనకరంగా ఉంటుందని చాలా మంది భావింస్తారు
TV9 Telugu
రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందించే బెల్లం మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులో క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది
TV9 Telugu
బెల్లంలో ఉండే ఇనుము, ఫాస్ఫరస్ రక్తహీనత ఎదురుకాకుండా చేస్తాయి. రక్తాన్ని శుద్ధిచేసే గుణం దీనికి ఉంది. గర్భిణులు బెల్లాన్ని తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల వివిధ రకాల అనారోగ్యాలు, అలర్జీల బారిన పడకుండా కాపాడుకోవచ్చు
TV9 Telugu
బెల్లం తినడం ద్వారా నెలసరి సమయంలో అధిక రక్తస్రావం నుంచి విముక్తి పొందచ్చు. నెలసరి నొప్పుల్నీ తగ్గించుకోవచ్చు. స్పాటింగ్ మాత్రమే అవుతోందని బాధపడే వారికి ఆ సమస్య తగ్గి ఎప్పటిలాగే పిరియడ్స్ ప్రారంభమవుతాయి
TV9 Telugu
ఇందులో ఇనుముతోపాటు కాల్షియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే మధుమేహంతో బాధపడేవారు చక్కెరకు బదులుగా బెల్లం తీసుకోవచ్చని చాలా మంది భావిస్తారు
TV9 Telugu
నిజంగానే మధుమేహ రోగులు బెల్లం తినవచ్చా? దీనికి నిపుణులు చెప్పే సమాధానం ఏంటంటే.. మధుమేహం ఉన్నవారు బెల్లం తినకూడదని చెబుతున్నారు. బెల్లంలో చాలా ఎక్కువ క్యాలరీలు ఉంటాయి
TV9 Telugu
దీని వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందని, మధుమేహానికి ఇది మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్కెరకు బదులుగా బెల్లం తినడం వల్ల తమకు ఎలాంటి హాని జరగదని భావిస్తారు
TV9 Telugu
కానీ ఇది నిజం కాదు. చక్కెర, బెల్లం రెండింటిలో గ్లైసెమిక్ సూచిక ఒకేలా ఉంటుంది. అయితే రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటే అప్పుడప్పుడు చిన్న బెల్లం ముక్క తినవచ్చు. కానీ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి