వంకాయలు ఎవరు తినడం ప్రమాదకరమూ తెలుసా?

samatha

02 september 2026

Pic credit - Pinterest

కూరగాయల్లో వంకాయను రాజు అంటారు. అంతే కాకుండా వంకాయతో ఎలాంటి వంటకాలు చేసినా రుచి అద్భుతంగా ఉంటుంది.

అయితే వంకాయలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారు అస్సలే తినకూడదు అంటారు.

ఎవరు అయితే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో సతమతం అవుతుంటారో, వారు అస్సలే వంకాయ కర్రీ తినకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అంతే కాకుండా, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు ఉన్నవారు తినకూడదు, ఇందులో ఆక్సలేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన దీనిని తినకపోవడం మంచిది.

అంతే కాకుండా వంకాయకు వేడి చేసే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన మలబద్ధకం, ఫైల్స్ సమస్యతో బాధపడే వారు తినకూడదంట.

అలాగే అలెర్జీ, దురద ,సైనస్ వంటి సమస్యలతో బాధ పడే వారు కూడా వీలైనంత వరకు వంకాయకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

అలాగే వంకాయలో సోలనిన్ అనే పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన కీళ్ల వాపు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు కూడా వంకాయ తినకూడదంట.

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెగులు దీనిని ధృవీకరించలేదు.