కూరలో ఉప్పుఎక్కువైందా.. కంగారు పడకండి అద్భుతమైన చిట్కా మీకోసం!

Samatha

14 july  2025

Credit: Instagram

వంటలు అద్భుతంగా రుచిగా ఉండాలంటే, అందులో ముఖ్యమైనది ఉప్పు, కారం సరిపడినంత ఉండాలంటారు పెద్దవారు.

ఉప్పు, కారం సరిగ్గా ఉంటేనే ఆ వంట తినడానికి బాగుంటుంది. అయితే చాలా మంది వంట చేసినప్పుడు చేసే అతి పెద్ద తప్పు ఉప్పు ఎక్కువ వేయడం.

ఉప్పు తక్కువగా ఉన్నా మళ్లీ వేసి సరి చేసుకోవచ్చు కానీ, కూరల్లో ఎక్కువ ఉప్పు ఉంటే అసలు ఆ కర్రీ తినడానికి ఎవరూ ఇష్టపడరు.

దీంతో వంట చేసే మహిళలు దానిని పారేయ్యలేక, అలా ఎలా ఉప్పు వేసాను, మంచి కర్రీ పాడైపోయిందని బాధపడుతుంటారు.

కానీ ఉప్పు ఎక్కువైనా ఈ సింపుల్ టిప్స్‌తో దాన్ని సరి చేయవచ్చునంట. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం పదండి మరి !

కూరల్లో ఉప్పు ఎక్కువైతే, అప్పుడు టమోటా, ఉల్లిపాయ ముక్కలను కొన్ని కట్ చేసుకొన వాటిని పేస్ట్‌లా చేసి ఆ కర్రీలో యాడ్ చేయడం వలన ఉప్పు తగ్గిపోతుందంట.

అదే విధంగా ఏ కర్రీలోనైతే ఉప్పు ఎక్కువ అవుతుందో, అందులో కాస్త మజ్జిగ కలపడం వలన ఉప్పు తగ్గిపోతుందంటున్నారు నిపుణులు.

కర్రీలో ఉప్పు ఎక్కువైనప్పుడు ఆలుగడ్డలను తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి కర్రీలో వేసి 15 నిమిషాలు ఉడకబెట్టీ తీసి బయట వేయాలంట. దీని వలన ఉప్పు సరిపోతుంది.