రోజూ ఉదయాన్నే ఓ యాపిల్‌ పండు తిన్నారంటే..

25 November 2024

TV9 Telugu

TV9 Telugu

రోజూ ఒక యాపిల్‌ తింటే డాక్టర్‌తో పని ఉండదని చిన్నప్పటి నుంచీ ఎన్నోసార్లు వినే ఉంటారు. ఇందులో నిజమెంతుందో ఎప్పుడైనా ఆలోచించారా?

TV9 Telugu

యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. ఇందులో కెలోరీలు, పీచు, సి-విటమిన్, కాపర్, పొటాషియం వంటి పోషకాలు అధికం. అందుకే రోజుకు ఒక యాపిల్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు

TV9 Telugu

ముఖ్యంగా ఉదయం పూట ఖాళీ కడుపుతో ఆపిల్ తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండులోని ప్రొటీన్లు, ఐరన్, పీచు, కాల్షియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి నిండుగా అందుతాయి

TV9 Telugu

యాపిల్స్‌లోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుస్తూ ఆరోగ్యంగా ఉంచుతాయి. యాపిల్స్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గుముఖం పడతాయి

TV9 Telugu

మలబద్ధక సమస్యను నివారిస్తుంది. ఇది రక్తపోటును క్రమబద్ధం చేస్తుంది. పాంక్రియాజ్‌ మంచిది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంట, తాపం, బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మంచి పోషకాలతో దండిగా ఉంటుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునేవారికి యాపిల్‌ మంచిది

TV9 Telugu

అధిక ఫైబర్, నీటి కంటెంట్ కారణంగా యాపిల్స్ బరువు నిర్వహణలో సహాయపడతాయి. యాపిల్స్‌లోని క్వెర్సెటిన్, కాటెచిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కణాలను ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తాయి

TV9 Telugu

అంతేకాదు యాపిల్స్ క్యాన్సర్, న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది త్వరగా జీర్ణమవుతుంది కనుక వృద్ధులకు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కూడా మంచిది

TV9 Telugu

మనలో చాలామంది యాపిల్‌ చెక్కు తీసి తినడానికి ఇష్టపడతాం. నిజానికి అందులో యాంటీ ఆక్సిడెంట్లు విస్తారంగా ఉన్నాయి కాబట్టి తీయకుండానే తినాలని చెబుతున్నారు ఆహార నిపుణులు. యాపిల్‌ ఎలా తిన్నా రుచిగానే ఉంటుంది