ముల్లంగి ఆకులు అనారోగ్యానికి యమా రాజు.. ఆ సమస్యల పాలిట విలన్.. 

Prudvi Battula 

Images: Pinterest

01 November 2025

ముల్లంగి ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, గుండెను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

బలహీనమైన రోగనిరోధక శక్తితో బాధపడుతున్న వారికి ఈ ఆకులను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

ముల్లంగి ఆకులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

మలబద్ధకం దూరం

ముల్లంగి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లను నివారించడంలో చాలా సహాయపడుతుంది.

ఇన్ఫెక్షన్లు నివారిస్తాయి

ముల్లంగి ఆకుల్లో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనతతో బాధపడేవారికి మేలు చేస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.

రక్తహీనత తగ్గుతుంది

ముల్లంగిలో విటమిన్ సి ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఎక్కువ ఫైబర్

ఈ ఆకుల వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముల్లంగి శీతాకాలంలో సాధారణ శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది.

శరీర ఉష్ణోగ్రత

ముల్లంగిలో పొటాషియం ఉంటుంది. అందువల్ల ఈ కూరగాయ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్ట్రోక్, గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.

స్ట్రోక్, గుండెపోటు ప్రమాదం