తెల్ల ఉల్లిని మీ ఆహారంలో చేర్చితే.. అనారోగ్యాన్ని కాటికి సాగనంపినట్టే..

21 September 2025

Prudvi Battula 

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెత మీరు వినే ఉంటారు. మార్కెట్‌లో విరివిగా దొరికే ఎర్ర ఉల్లి కంటే అరుదైన తెల్ల ఉల్లిగడ్డతో ఎక్కువగా లాభాలు ఉన్నాయి.

చాలామంది ఏ రంగు ఉల్లిపాయలతో ఎక్కువ లాభాలు అనే సందేహం ఉంది. అయితే ఎర్ర ఉల్లితో పోల్చుకుంటే తెల్ల వాటిలోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయని తేలింది.

తెల్ల ఉల్లిపాయలో విటమిన్‌ సి, ఫ్లేవనాయిడ్స్‌, ఫైటోన్యూట్రియెంట్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ప్రయోజనకరం.

వీటిని పచ్చిగా తీసుకున్న లేదా ఉడికించి తిన్న కూడా రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి.

ఔషధాల తయారీలో కూడా తెల్ల ఉల్లిని వాడుతుంటారు. వీటిలో ఉన్న క్రోమియం, సల్ఫర్‌ రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది.

తెల్ల ఉల్లిని తరుచూ తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఇందులో సల్ఫర్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌‎ను దూరం చేస్తాయి.

దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఒంట్లో కణితి పెరుగుదలను నిరోదిస్తుంది. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

ఇవి అధిక రక్తపోటు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రక్తం గడ్డ కట్టకుండా నిరోధిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.