బీరు సీసాలు ఆకుపచ్చ, బూడిద రంగుల్లోనే ఎందుకు ఉంటాయో తెలుసా?
25 November 2024
TV9 Telugu
TV9 Telugu
సందర్భం ఏదైనా సరే కుర్రకారు చల్లని బీరు కొట్టందే సెలబ్రేషన్స్ పూర్తి చేయరు. వర్క్ నుంచి ఉపశమనం పొందాలన్నా.. కాసేప్ చిల్ అవ్వాలన్నా అత్యధికులు ఎంచుకునేది బీరే
TV9 Telugu
మేం తాగేది బ్రాందీ కాదు.. బీరే కదా అని చాలామంది సమర్థించుకుంటారు. కానీ బీరులోనూ ఆల్కహాల్ ఉంటుంది. ఇం 650 మి.లీ. బీరులో 5-7.5 శాతం ఆల్కహాల్ ఉంటుంది
TV9 Telugu
బ్రాందీ, విస్కీలలో 42.8 శాతం, వైన్‌లో 6-24 శాతం వరకూ ఆల్కహాల్ ఉంటుందట. ఇలాంటప్పుడు బీరే కదాని పరిమితికి మించి తాగేస్తే.. నేరుగా షెడ్డుకే. రోజుకు 90 ఎంఎల్ కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే అది కాలేయంపై నేరుగా ప్రభావం చూపుతుంది
TV9 Telugu
అయితే మీరెప్పుడైనా గమనించారా? బీర్ బాటిల్ ఆకుపచ్చ లేదా గోధుమ రంగుల్లో మాత్రమే ఉంటుంది.. కేవలం ఈ రెండు రంగుల్లోనే బాటిళ్లు ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా ఆలోచించారా?
TV9 Telugu
మార్కెట్లో వందల రకాల బీర్‌లు ఉన్నప్పటికీ, సీసాలన్నీ ఎక్కువగా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో ఉంటాయి. బీర్ బాటిల్స్ ఎక్కువగా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో ఎందుకు ఉంటాచో ఇక్కడ తెలుసుకుందాం
TV9 Telugu
ఎందుకంటే.. సాదా లేదా ఇతర రంగుల సీసాలలో నిల్వ ఉంచిన బీర్ కాంతికి తాకినప్పుడు, దాని రుచి క్షీణించడం ప్రారంభమవుతుంది. అదే ఆకుపచ్చ లేదా గోధుమ రంగులు సూర్యరశ్మికి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి
TV9 Telugu
దీని వల్ల బీరు రుచి, తాజాదనం చెక్కుచెదరకుండా ఉంటాయన్నారు తయారీ దారులు. భారతదేశపు అతిపెద్ద బీర్ తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ ఈ దృగ్విషయాన్ని 'లైట్‌స్ట్రక్' అని పిలుస్తుంది
TV9 Telugu
అందుకే ఏ బ్రాండ్ బీరు సీసా అయినా సరే కేవలం ఆకుపచ్చ, గోధుమ రంగుల్లోనే ఉంటాయి. ఇక బీర్లు, శీతల పానీయాలు మోతాదుకు మించి తీసుకోవడం అనారోగ్యాన్ని ఆహ్వానించడమే. కాస్త చూసి తాగండి మరీ..